‘ఖిలాడి’ రిలీజ్ ఆలస్యం కానుందా?

రవితేజ హీరోగా రమేశ్ వర్మ ‘ఖిలాడి’ సినిమాను రూపొందించాడు. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో, రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అలరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ నుంచే అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. రవితేజ తనదైన జోష్ తోనే కనిపిస్తున్నాడు.

ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. రవితేజ కూడా ఆ తరువాత సినిమాలకి సంబంధించిన షూటింగ్స్ లో బిజీ అయ్యాడు. దాంతో ఈ సినిమా షూటింగు పూర్తయిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగు ఇంకాస్త మిగిలే ఉండనే టాక్ వినిపిస్తోంది.

విదేశాల్లో చేయవలసిన ఒక షెడ్యూల్ పెండింగ్ లో ఉందని అంటున్నారు. ఇక్కడ సెట్ వేసో .. గ్రీన్ మ్యాట్ వేసో చేసేవి కాదట అవి. ఇప్పుడు విదేశాల్లో షూటింగు చేసే పరిస్థితి లేదు. అందువలన ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags: Raviteja, Meenakshi Choudary, Dimple Hayathi, Khiladi Movie

Leave A Reply

Your email address will not be published.