‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి మరో ఫోటో షేర్ చేసిన టీమ్!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముస్తాబవుతోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వేగంగా అప్ డేట్ లను వదులుతున్నారు.

ఈ సినిమా నుంచి ఈ రోజున సాయంత్రం ‘నాటు నాటు’ పాటను సెకండ్ సింగిల్ గా వదలనున్నారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ మరో ఫోటోను షేర్ చేసింది. ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరూ కూడా చాలా స్టైల్ గా .. కూల్ గా కనిపిస్తున్నారు.

అల్లూరిగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.