దళితబంధు అమలు చేయకపోతే డప్పుల మోతే’’
హైదరాబాద్:-దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ అమలు చేయకపోతే భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 9న డప్పుల మోత మోగిస్తామని గట్టిగా హెచ్చరించారు.
కేసీఆర్ మళ్లీ రెండు ఉపఎన్నికలు వస్తాయని చెబుతున్నారని.. ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది భాజపానేనని ఆశాభావం వ్యక్తం చేశారు.పెట్రో ధరల పేరుతో కేంద్రాన్ని తెరాస బదనాం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.