తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఆయుధాలను వెంట ఉంచుకునేందుకు వ్యాపారులకు అనుమతి

Talibans Green Signal to people to have weapons in their possession
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వ్యాపారులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వ్యాపారులు తమ స్వీయ రక్షణ కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం అనంతరం ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు తెలిపింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖోస్టాయ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.