ఆర్ఆర్ఆర్ నుంచి ‘జనని’ గీతం విడుదల

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం నుంచి తాజాగా ‘జనని’ అనే గీతం విడుదల చేశారు. భావోద్వేగాలతో కూడిన ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చడంతో పాటు సాహిత్యం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఆయనే స్వయంగా పాడారు. ఈ పాట వీడియోలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను కూడా చూడొచ్చు.

కాగా, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ‘జనని’ అనే పాట ఆత్మ వంటిదని దర్శకుడు రాజమౌళి చెప్పిన నేపథ్యంలో ఈ పాటపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాటను నేడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు.

Leave A Reply

Your email address will not be published.