బెగ్గింగ్ గ్యాంగ్ ఆటకట్టించండి.. మీరు ఇలా సాయం చేయండి

బెగ్గింగ్ మాఫియా రోజు రోజుకీ చాలా ప్రమాదకరంగా తయారవుతోంది. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి.. అవయవాలు కత్తిరించడం లేదా యాసిడ్‌తో వికృతీకరించడం చేస్తున్నారు. కొందరికి శరీర భాగాలకు రక్త సరఫరాను నిలిపివేయడానికి రక్త నాళాలు కట్ చేస్తున్నారు. వీరిపై ప్రజల్లో సానుభూతి తెప్పించేలా చేసి.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అందుకే ఈ బెట్టింగ్ ముఠా ఆట కట్టించాలంటే.. చిన్న పని చేయాలి. అందులో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. నేటి నుండి బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు మాత్రమే ఇద్దాము, ధన రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు. ఒక నిర్దిష్టమైన సామాజిక పునరుజ్జీవనం కోసం ముంబైలో ప్రతి ఒక్కరూ “ఇప్పటి నుండి, మేము అన్ని రకాల బిచ్చగాళ్లకు (మహిళలు / పురుషులు / వృద్ధులు / వికలాంగులు / పిల్లలు) ఆహారం మరియు నీరు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వము” అని ప్రమాణం చేశారు. దీని ప్రయోజనం ఏమిటంటే బెగ్గింగ్ మాఫియా యొక్క ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల పిల్లల అపహరణ కూడా తగ్గుతుంది. అందుకే నేటి నుంచి మీరు కూడా ఈ సామాజిక మార్పుకోసం భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం.

Leave A Reply

Your email address will not be published.