జేసీ అల్లుడా… మజాకా
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కీలకమైన పదవి దక్కింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా చంద్రబాబు ప్రకటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దీపక్ రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు. 2011లో దీపక్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్. మరణం తరువాత జగన్ తో కలసినా… ఆ తరువాత టీడీపీలోకి వచ్చారు. ఆ క్రమంలో అంటే 2012లో ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి దీపక్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 వరకూ రాయదుర్గం నియోజకవర్గం పార్టీ ఇన్చార్జ్గా పనిచేశారు. 2017లో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటీవల టీడీపీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో ఈయన కూడా ఒకరు. అందుకే పార్టీ తగిన గుర్తింపు ఇచ్చింది.