Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలా అనేది కార్మికులు నిర్నయించుకోవాలి

0

తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై
చెన్నై:కార్మికుల పని సమయాన్ని 12గంటలకు పెంచు తూ డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మిత్రపక్షాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పు బడుతుండగా, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసైమాత్రం స్టాలిన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. సోమవారం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తమిళిసై మీడియతో మాట్లాడుతూ.. రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలు పనిచేయాలా అనే విషయాన్ని కార్మికుడు నిర్ణయించుకోవాలన్నారు. ఈ చట్టంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల వద్ద అధ్యయనం చేశారన్నారు.

ఇందులో అధిక సమయం పని చేసి, అధిక సమయం విశ్రాంతినివ్వడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తేలిందన్నారు. ఇక్కడ పని గంటలు మాత్రమే పెంచారని, కార్మికుడిపై అధిక భారాన్ని మోపలేదన్నారు. ఈ చట్టాన్ని ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ఈ చట్టాన్ని రాజకీయం చేయరాదని సూచించారు. తాను ఒక గవర్నర్‌గా ఉన్నందున, రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే – బీజేపీ కూటమి గురించి తనకేమీ తెలియదన్నారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఇతర రాజకీయ పార్టీల నేతల వద్ద తనకు మంచిపేరు, గౌరవం ఉండేదని తమిళిసై గుర్తు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie