నెల్లూరు
ప్రజావైద్యులు డా౹౹జెట్టి శేషారెడ్డి స్మృతిలో ఆయన 13వ స్మారక రాష్ట్ర సదస్సు 2023, అను ఈనెల 11న, ఆదివారం ఉదయం గం.9.30లకు నెల్లూరు అపోలో ఆసుపత్రికి ఎదురుగా ఉన్న డా౹౹శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడుతుందని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలు మేరకు ఈ సదస్సులో 2 ప్రధాన అంశాలపై ప్రముఖల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ “జాతీయ వాదం – ప్రస్తుత పోకడలు”అంశంపై ఉపన్యసిస్తారని తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా౹౹ పి. వి. రమేష్ “ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థ – రేపటి అవసరాలు – ప్రభుత్వ బాధ్యత” అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మాజీ శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం పాల్గొంటారని తెలియజేశారు.
ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కెసిఆర్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
డా౹౹రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్ డా౹౹బి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగే ఈ రాష్ట్ర సదస్సును డా౹౹శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, డా౹౹రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల, ప్రజా ఆరోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, ఎ.పి.మెడికల్ అండ్ సేల్స్ రెప్స్ యూనియన్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.కావున అందరూ ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.