Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

108 శ్రీ చక్రాల శ్రీ లలితా మాత ఆలయంలో వైభవంగా మహిళలచే కుంకుమార్చన….

108 Shree Chakras Shree Lalita Mata Panchamrita Abhishekam

0

Panchamrita Abhishekam జగిత్యాల రూరల్ పోలాస గ్రామంలో వెలసిన 108 శ్రీ చక్రాల శ్రీ లలితా మాత ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి పలు పుష్పాలతో అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.అనంతరం విశేష సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు.

అలాగే శ్రీ లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారి భక్తీ కీర్తనలతో భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజాలు నిర్వహించారు, విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ లలితా మాత ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూప సత్తన్న, సంఘ సభ్యులు పంపటి రవీందర్, సులోచన, నల్మాస్ మహేందర్, రంగా ప్రసన్న, పెద్ది అశ్విని, పూటూరి కళ్యాణి, సుర రజిత, అపర్ణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie