తిరుపతి
కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి నెఫ్రాలజి విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
టీటీడీ జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి శుక్రవారం ఆయన నెఫ్రాలజి, యూరాలజి విభాగాలను పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డులు, డయాలసిస్ వార్డులు, ఐ సి యూ విభాగాలను పరిశీలించారు. ఇక్కడ అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఇంటి వద్దే డయాలసిస్ చేసుకునే అవకాశం ఉండి ఆసుపత్రికి వస్తున్న రోగుల గురించి ఈవో వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ కోసం ఉపయోగించే బ్యాగులకు డిమాండ్ ఉందని డాక్టర్లు చెప్పారు. ఏపీ ఎం ఐడిసి చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి తో ఈవో అక్కడి నుండే ఫోన్ లో మాట్లాడి స్విమ్స్ కు డయాలసిస్ బ్యాగులను పంపాలని కోరారు. రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న పిల్లలకు పెన్షన్ రావడం లేదని బాధితుల కుటుంబీకులు ఈవో దృష్టికి తెచ్చారు. పెన్షన్ మంజూరు చేయించడానికి తమవైపు నుంచి సహాయం చేస్తామని ఈవో చెప్పారు. స్విమ్స్ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత గురించి విద్యార్థులతో మాట్లాడారు.
నగరపాలక పరిధిలో గృహనిర్మాణాలు వేగవంతం కావలి :జిల్లా కలెక్టర్
అనంతరం ఈవో ఆయా విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్ వేర్ లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఐటి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించిన ఇంజినీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలాజి, యూరాలజి విభాగాల పనితీరు బాగుందని అభినందించారు.