- కడప నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం
- డిప్యూటీ సిఎం ఎస్.బి. అంజాద్ బాషా, మేయర్ కె సురేష్ బాబు
గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతోందని, కడప నగరం లో రోడ్డు విస్తరణ కు సహకరించిన స్థల యజమానులకు సంయుక్తంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు లు సంయుక్తంగా కృతజ్ఞతలు తెలిపారుశనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నుండి వై. జంక్షన్ మధ్య 80′ . 0″ అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణకు అంగీకరించి ప్రభుత్వ ఉత్తర్వు నెం.223 ఎం. ఏ. & యు. డి. తేదీ 9-7-2018 ప్రకారం టి.డి.ఆర్. (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండు పత్రాలను తీసుకొనుటకు సహకరించిన భవన యజమానులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు ల చేతులమీదుగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలోబిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు లతోపాటు డిప్యూటీ మేయర్లు నిత్యానంద రెడ్డి, ముంతాజ్ బేగం, నగర మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష మాట్లాడుతూ తొలుత కడప నగర అభివృద్ధిలో భాగంగా కడప నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందో అందుకు సహకరించిన స్థల యజమానులకు పేరుపేరునా ధన్యవాదాలుతెలుపుతున్నానన్నారు. ఏ నగరమైన అభివృద్ధి చెందాలంటే రోడ్డు విస్తరణలు అనేది ఎంతో ముఖ్యమని ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అనంతరం వచ్చిన పాలకులు ఎవరూ కానీ అభివృద్ధి చేయడానికి నోచుకోలేదని అన్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను అనుగుణంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిని చూస్తున్నామని అన్నారు.
గతంలో ప్రతి ఇంటికి ఒక వాహనం ఉండేదని, ప్రస్తుతం ప్రతి ఇంటికి ఒక కారుతోపాటు రెండు మూడు వాహనాలు కూడా ఉండడం జరుగుతున్న పరిస్థితి ఉందని అన్నారు. కడప నగరంలో బయటకు వెళ్లి షాపింగ్ చేయాలన్న ట్రాఫిక్ వల్ల చేయలేని పరిస్థితి ఉన్నదని, పార్కింగ్ స్థలం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నుండి మనమందరం అధికమించాలంటే రోడ్డు విస్తరణ తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. అందరి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటినుండి కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని అందుకు కొన్ని రోడ్లను విస్తరణ చేయాలని, కడప నగరంలోని 16 రోడ్లను విస్తరణ చేసేందుకు నిర్ణయించడం జరిగిందని చెప్పారు.16 రోడ్లలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడు (7) రోడ్లకు మంజూరు ఇవ్వడం జరిగిందని, 7 రోడ్లకు గాను రెండు (2) రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగిందని, మహావీర్ సర్కిల్ నుండి రిమ్స్ రోడ్డు వరకు, మహావీర్ సర్కిల్ నుండి రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ చేయడం జరిగిందని అన్నారు. తరువాత విస్తరణకు వచ్చిన రోడ్లలో (4) నాలుగు రోడ్లని అంబేద్కర్ సర్కిల్ నుండి వై జంక్షన్ వరకు, కృష్ణా సర్కిల్ నుండి దేవుని కడప రోడ్డు, మాసాపేట సర్కిల్ నుండి బైపాస్ రోడ్డుకు, అన్నమయ్య సర్కిల్ నుండి గోకుల్ లాడ్జి వరకు ఈ నాలుగు రోడ్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 305 కోట్ల మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రోడ్డు అభివృద్ధి విస్తరణ చేయాలన్న డబ్బుతో కూడుకున్న పని అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇందులో ముఖ్యంగా ల్యాండ్ అక్యులేషన్ ఎంతో కష్టతరమైన పని అని అన్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా వాసి అయినందున రోడ్డు విస్తరణ పనులకు ఎంతో అవసరమని సముఖత్వాన్ని తెలిపారని అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా టి.డి.ఆర్. లను మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ అమలు చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి భారం లేకుండా, భారాన్ని తగ్గిస్తూ ఎంతో ఉపయోగపడే విధంగా భద్రతను, విలువను పెంచే విధంగా టి డి ఆర్ బాండ్ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్థల యజమానుదారులు ప్రభుత్వానికి కడప నగర పాలక సంస్థకు సహాయ సహకారాలు అందించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా స్థల సేకరణ కొరకు అధికారులు సిబ్బంది కష్టపడి స్థల యజమానుదారులను ఒప్పించి రోడ్ల విస్తరణకు తీసుకోవడం జరిగిందని అన్నారు. రాబోవు రోజుల్లో మనమందరం కలిసి ఈ నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
నగర అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వారు నగర సుందరీకరణకు పలు పనులకు అనుమతించడం జరిగిందని చెప్పారు. కడప నగర రోడ్ల విస్తరణకు సహకరించిన స్థల యజమానుల సహకారం మరువలేమని, సహకరించిన యజమానులు చరిత్రలో నిలిచిపోతారని, అలాగే ఎలాంటి సహకారం కావాలన్నా తాము ముందుండి అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధిలో పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, బాలస్వామి రెడ్డి, బండి ప్రసాద్, అజ్మతుల్లా ఖాన్, రామలక్ష్మణ రెడ్డి, జమాల్ వల్లి, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి,సుదర్శన్ రెడ్డి, శివ కోటి రెడ్డి, జహీర్, అరిఫ్,డిష్ జిలానీ,షఫీ,అజ్మతుల్ల, చాక్లేట్ గౌస్,అలి అక్బర్,కమాల్ భాషా,రాజశేఖర్ రెడ్డి, హరూన్ బాబు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.