• రాష్ట్రంలో అంతాబాగుందని డీజీపీచెప్పడం ఎంతమాత్రం సరైందికాదు.
• ప్రభుత్వ, పాలకుల అవినీతి, అక్రమాలు, దోపిడీకి కాపలాకాయడమే పోలీసులపనిగా మారింది.
మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
జగన్మోహన్ రెడ్డిపాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, ప్రభుత్వ, పాలకులు అక్రమాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీకి కాపలాకాయడమే పోలీసుల పనిగా మారిందని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలరక్షణ అనేవి పోలీస్ విభాగానికి అసలు పట్టడంలేదని టీడీపీనేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతినిప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెడుతూ, వైసీపీనేతలు, కార్యకర్తల రక్షణే తమవిధినిర్వహణ అన్నట్టుగా రాష్ట్రపోలీస్ శాఖ వారికి కంచెలా కాపలాకాస్తోంది. వైసీపీనేతలు, కార్యకర్తలే రక్షణే తమవిధినిర్వహణ అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ అధికారపార్టీకి కంచలా కాపలాకాస్తోంది.
ప్రభుత్వ, పాలకులఅక్రమాలు అవినీతిని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెట్టి అకారణంగా అరెస్ట్ చేయడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. విశాఖపట్నంలో సాక్షాత్తూ అధికారపార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయ డం రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పనితీరుకి నిదర్శనమని అన్నారు. సొంతపార్టీ ఎంపీకుటుంబాన్ని కా పాడలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ముఖ్యమంత్రే అక్రమాలు, దోపిడీలు పెంచిపోషిస్తూ, మాఫియాడాన్ ల తయారవ్వడం నిజంగా దురదృష్టకరం. రాష్ట్రసహకారరంగాన్ని వైసీపీప్రభుత్వం దోపిడీకి అడ్డాగామార్చుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వైసీపీనేతనుంచి ముఖ్యమంత్రివరకు సహకారరంగంలో రూ.5వేలకోట్లు కాజేశారు. దీనిపై దర్యాప్తుజరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదుచేయడం జరిగింది. అందరికోసం పనిచేయాల్సిన సహకారవ్యవస్థలో జవాబుదారీతనం లేకుండాచేసి, జేబుదొంగలకు అప్పగించారని అన్నారు. . రాష్ట్రంలోని సహకారసంఘాలకు వచ్చేవేలకోట్ల లావాదేవీలపై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదలచేయాలఅయన డిమాండ్ చేసారు.