సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలి
తుగ్గలి
మూడు నెలలకు ఒకసారి మండల అభివృద్ధి పురోగతిపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని తుగ్గలి ఎంపీటీసీ మాసిపోగు రాజు,బొందిమడుగుల ఎంపిటిసి జల్లా సుంకన్న లు తుగ్గలి మండల ప్రజా పరిషత్ అధికారిని సావిత్రి కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన తుగ్గలిలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గురువారం రోజున నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి విద్యుత్ శాఖ అధికారులు,ఆర్ అండ్ బి అధికారులు,పోలీసు అధికారులు,ఎక్సైజ్ అధికారులు ఎవరూ హాజరు కావడం లేదని ఎంపీడీవో కు తెలియజేశారు.
ఇప్పటివరకు జరిగిన నాలుగు సర్వసభ్య సమావేశాలకు కూడా సరిగా హాజరు కావడం లేదని వారు తెలియజేశారు.మండల వ్యాప్తంగా విద్యుత్, రోడ్డు తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులుగా మేము అధికారుల దృష్టికి తీసుకువెళదామంటే వారు సమావేశాలకు హాజరు కావడం లేదని ఎంపీటీసీలు తెలియజేశారు.ప్రజల సమస్యలు పరిష్కారం కాక,ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లలేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఎంపీటీసీలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఎంపీడీవోకు తెలియజేశారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసానికి సీఎం జగన్ తల్లి విజయమ్మ
సర్వసభ్య సమావేశానికి హాజరుకాని మండల స్థాయి అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు ఎంపీటీసీలు రాజు, సుంకన్నలు తెలియజేశారు. ఈ సమస్యపై ఎంపీడీవో సావిత్రి మాట్లాడుతూ వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీటీసీలు తెలియజేశారు.