హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు ఆయన ఛాంబర్ లో సీఎం కేసిఆర్ తో కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులతో కలసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తో కేక్ కట్ చేయించారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు శాసనసభలో మంత్రి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.