హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో, మల్కాజ్గిరి చౌరస్తా లో జాతీయ జెండాను మైనాంపల్లి హన్మంతురావు ఆవిష్కరించారు. తెలంగాణ ఎర్పడిన తరువాత ఎనో సంక్షేమం పథకాలు, అభివృధి తో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని ఈ ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి kcr కే దక్కుతుంది అని అన్నారు.
నిర్మల్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకలలో పాల్గోన్నారు. కలెక్టరేట్, మిని ట్యాంక్ బండ్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్ లో మంత్రి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
52 అడుగులతో పంచముఖ ఆంజనేయస్వామి.
సింగరేణిలో ధూంధాం గా తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలు నడిచాయి. . మహిళా ఉద్యోగుల బతుకమ్మ ఆటలు, డీజే తెలంగాణ పాటలతో ఉద్యోగుల ధూంధాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గని ప్రాంగణంలో గ్రూప్ ఏజెంట్ ఏవీ రెడ్డి, మేనేజర్ అబ్దుల్ ఖదీర్ లు ధూంధాం డాన్స్ లతో ఉత్సవాలు ప్రారంభించి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. ఆటపాటలతో సింగరేణి ప్రాంతంలో కోలాహాలంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.