సామాజిక బాధ్యతతో కడూరు యువత ముందుకు కదిలింది. బీటలు వారిన వంతెనపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తూ, వర్షపు నీరు వెళ్లడానికి విపరీతంగా పేరుకుపోయిన చెత్తను తీస్తు ఆదర్శంగా నిలిచారు కడూరు యువకులు..తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని కడూరు సమీపంలో ఉన్న వంతెన పై ఏర్పడ్డ గుంతలతో ఇటీవల ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కడూరు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక బాధ్యతతో బ్రిడ్జిపై ఏర్పడ్డ గుంతలను పుడుస్తూ.. బ్రిడ్జి పైనున్న మట్టి, చెత్తను శుభ్రపరిచారు.
యూ టర్న్ తీసుకున్న మాజీ మంత్రి.
వందల కొద్ది భారీ వాహనాలు ప్రయాణం సాగించే ఈ దారిలో కీలక వంతెనలలో ఇది కూడా ఒకటి.. వంతెన పైభాగం పై లెక్కలేనన్ని గతుకులు ఏర్పడడం కొన్నిచోట్ల లోపలి భాగం కూడా కనబడుతుండడంతో ప్రయాణించే సమయాల్లో గమనించకుండా వెళితే అంతే సంగతులు. మరీ ముఖ్యంగా రాత్రివేళలో భారీ వాహనాలు వేసుకుని వచ్చే లైట్ల కాంతితో ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనదారులు గుంతలను గమనించుకోలేని పరిస్థితిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ప్రయాణపరంగా, రవాణా పరంగా ఎంత కీలకమో తక్షణమే గుర్తించి మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు