Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రౌడీ షీటర్ హత్యకేసులో ముగ్గురు అరెస్టు.

0

రౌడీ షీటర్ రాజాన కన్నబాబు హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసారు. హత్య కేసులో అనకాపల్లి ప్రాంతానికి చెందిన చిన్ని లక్ష్మణరావు అలియాస్ లచ్చ, పందిరి దుర్గారావు, లోపింటి సురేంద్ర లు అరెస్ట్ చేసారు. చోడవరంలోని ఒక భూమి విషయమై లక్ష రూపాయల కోసం రౌడీ షీటర్ లు రాజాన కన్నబాబు, చిన్ని లక్ష్మణరావు మధ్య వివాదం నెలకొందని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ వెల్లడించారు. ఈ వివాదం ముదరడంతో రౌడీ షీటర్ చిన్ని లక్ష్మణరావు తన అనుచరులైన పందిరి దుర్గారావు, లోపింటి సురేంద్ర తో కలిసి రౌడీ షీటర్ కన్నబాబును

తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..

హతమార్చినట్లు ఎస్పీ   వెల్లడించారు. నిందితులు కత్తి ,కర్ర ఉపయోగించి కన్నబాబు పై దాడి
చేసారు. రౌడీ షీటర్  హత్య నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా పెంచాం. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ లు నమోదు చేస్తాం జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఒక రోజులో హత్య కేసులో నిందితులను పట్టుకోవడంతో రూరల్ పోలీసులను అయన అభినందించారు. నిందితుల  నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, కర్ర ,కత్తి స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie