రక్తనాళాల శస్త్ర చికిత్సలో ఆధునిక విధానాలు : డాక్టర్ అజయ్
నంద్యాల
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జఫరుల్లా,డాక్టర్ చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ పనిల్ ల నిర్వహణలో నంద్యాలలో స్థానిక సూరజ్ హోటల్ సమావేశ భవనంలో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి సహకారంతో నంద్యాల ప్రాంత వైద్యులకు నిర్వహించిన నిరంతర వైద్య విద్య సదస్సులో “రక్తనాళాల శస్త్ర చికిత్సలో ఆధునిక విధానాలు” అన్న అంశంపై ప్రముఖ వ్యాస్కులార్ సర్జన్ డాక్టర్ అజయ్ ముఖ్య వక్త గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
డాక్టర్ అజయ్ మాట్లాడుతూ రక్తనాళాలలో వచ్చే జబ్బులకు,షుగర్ వ్యాధి వలన పాదాలలోనీ రక్తనాళాలలో వచ్చిన మార్పుల వలన పాదం తొలగించాల్సిన ఆవశ్యకత ఏర్పడినప్పటికీ, రక్తనాళాల ఆధునిక శస్త్ర చికిత్స విధానాల ద్వారా పాదాన్ని కాపాడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రమాదాలలో రక్తనాళాలు తెగినప్పుడు కూడా సత్వర ఆధునిక విధానాల ద్వారా వాటిని సరిచేసి ఆయా అవయవాలకు తిరిగి రక్త ప్రసరణ జరిగే విధంగా చేయడానికి వాస్కులర్ సర్జరీలో అవకాశం ఉందని తెలిపారు.
ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” విడుదలకు సిద్ధం”
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యుల సమస్యలు ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వ రాష్ట్రస్థాయి అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ అధిక సంఖ్యలో వైద్యులు కిమ్స్ ఆసుపత్రి ప్రాంతీయ సమన్వయకర్త శేఖర్ తదితరులు పాల్గొన్నారు.