యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని,బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి నరేష్ సూచించారు.సీనియర్ సిటీజన్స్,దివ్యంగులు,ట్రాన్స్ జెండర్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు పద్మనాయక కల్యాణ మండపంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సదస్సు నిర్వహించారు. ఉదయం వివేకానంద మినీ స్టేడియం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన సదస్సులో నరేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చెడు దారులల్లో వెల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం వలన ఆరోగ్య,ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయన్నారు.బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్ద చికిత్స చేయించాలన్నారు.
కాంగ్రెస్ గూటికి చేరుతున్నాము క్లారిటీ ఇచ్చిన పొంగులేటీ, జూపల్లి..
తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల తయారీదారులు,రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను పదును చేయాలన్నారు.ప్రసార మాధ్యమాల్లో ఆల్కహాల్,
గుట్కా,సిగరెట్,జర్దా తదితరాలికి సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రకాష్ ,డిఎస్డీవో రాజ్ కుమార్,ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి,జిల్లా అంబుడ్స్ మెన్ అధికారి కృష్ణా రెడ్డి ,డిసిపివో హరీశ్, ఫీల్డ్ అధికారులు పాదం తిరుపతి,కొండయ్య,సామాజిక కార్యకర్త రాంచంద్రమ్,
తదితరులు పాల్గొన్నారు.