మృతదేహానికి జన్మదిన వేడుకలు
ఆసిఫాబాద్
జన్మదినం అంటే చాలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. బెలూన్ల డెకోరేషన్, కేక్ కటింగ్, దోస్తుల మజాకులు, పెద్దల ఆశీర్వాదాలు ఇలా ఎంతో సరదాగా జరుపుకుంటారు. కాని ఇక్కడ మాత్రం ఓ తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలుకుతూ తమను వీడి అనంత లోకాలకు వెళ్ళిన కుమారునికి జన్మదిన వేడుకలు చేశారు. స్నేహితులు తమ చిరకాల మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన 10 వ తరగతి విద్యార్థి సి హెచ్ సచిన్ (16) గుండే పోటుతో నిన్న మృతి చెందాడు. కాగా మరుసటి రోజే సచిన్ పుట్టిన రోజు కావడంతో రాత్రి 12 గంటలకు మృతి చెందిన సచిన్ చేతితో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు జరిపించారు. అక్కడ ఉన్నవారందరూ సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలతో పాటు కంట నీరు పెట్టుకున్నారు..