ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సినీనటి హెబ్బా పటేల్ బుధవారం రాహుకాల సమయంలో ప్రత్యేక రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదివరకు ఆమె నటించిన చిత్రాలు మిస్టర్, కుమారి 21ఎఫ్, ఓదెల రైల్వే స్టేషన్, ఒరేయ్ బుజ్జిగా, రెడ్ పలు చిత్రాల్లో ఆమె నటించారు. చాలా రోజుల తర్వాత శ్రీకాళహస్తి ఆలయంలో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఆలయం వెలుపల హెబ్బా పటేల్ ని చూసిన అభిమానులు చరవాణి లతో సెల్ఫీలు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా నవ్వుతూ పలకరించారు