Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం.

0

ఏడాది క్రితమే ఆ భూములు రీజినల్ రింగ్ రోడ్డు కింద పోతాయని అందరికీ తెలుసు. పలుమార్లు అధికారులు వచ్చి చూసి వెళ్లారు. డీజీపీఎస్ కో-ఆర్డినేట్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ స్థలాన్నే భూములు కోల్పోయిన బాధితులకు కట్టబెట్టేందుకు కొందరు రంగం సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఇలాఖాలోనే అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి నిధులు కాజేసేందుకు పన్నిన కుట్ర ఇది. అసలే మల్లన్నసాగర్‌లో సర్వం కోల్పోయిన బాధితులు. వారికి ఇచ్చిన నష్టపరిహారం అంతంత మాత్రమే. వారికి నివేశనా స్థలాల కింద ఇచ్చేందుకు వివాదాస్పద భూమిని ఎంపిక చేశారు. చకచకా ప్లాట్లు చేసి అప్పగించి చేతులు దులిపేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

 

ఎలాగూ ఆర్ఆర్ఆర్ కింద భూ సేకరణ జరుపుతారు. అది ముందుగానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలుసు. ఐనా పనులు చేసి రూ.కోట్లు కూడబెట్టేందుకు ప్లాన్ చేశారు.అది కూడా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి మీదుగానే రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తుంది. ఈ మేరకు భూ సేకరణకు రంగం సిద్ధమైంది. ఏయే సర్వే నంబర్లలోని భూములు పోతాయో వీఆర్వో మొదలు కలెక్టర్ దాకా అందరికీ తెలుసు. సర్వే పనులు మొదలైన నాటి నుంచి అధికార యంత్రాంగానికి సమాచారం ఉంది. కానీ, ఆ భూమిలోనే లే అవుట్ వేసి మల్లన్నసాగర్ బాధితులకు ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

దీంతో రెండోసారి బాధితులకు అన్యాయం జరగనుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఆ సర్వే నంబర్లలో యుద్ధప్రాతిపదికన లేఅవుట్ వేస్తున్నారు. సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారు. డ్రైనేజీ పనులను చేపట్టారు. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏడాది క్రితమే సదరు భూమిని సేకరిస్తామని ఎన్ హెచ్ఏఐ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు రూ.కోట్లు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటి? రీజినల్ రింగ్ రోడ్డు వేసేటప్పుడు అవన్నీ కూల్చేయడం ఖాయం. సేకరించే భూమిని డెవలప్మెంట్ చేయడమంటే బిల్లులు, పర్సంటేజీల కోసమే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండడం స్థానికంగా దుమారం రేగుతున్నది. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే నిధులు దుర్వినియోగం చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కుట్ర చేయడం విస్మయపరుస్తున్నది.

30న పోడు భూముల పంపిణీ.

గ్రీన్ ఫీల్డ్ రీజినల్ ఎక్స్ ప్రెస్ హైవే రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి సర్వే నం.326లో 9.28 ఎకరాల కోసం అలైన్మెంట్ మార్చాలని ఏప్రిల్‌లో సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌కు గజ్వేల్ ఆర్డీవో లేఖ రాశారు. దాన్ని రెఫరెన్స్‌గా తీసుకొని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్‌కి సిద్ధిపేట కలెక్టర్ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం తొగుట మండలం వేములఘాట్‌లో భూములను సేకరించాం. అక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఆ స్థలంలో ఆర్ అండ్ ఆర్ కాలనీని ఏర్పాటు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత స్థలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నడుస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie