మన ఊరు మనబడి పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు , జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి కార్యక్రమంలో జిల్లాలోని 149 పాఠశాలను ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా పాటశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారిగా పాఠశాలల్లో నిర్మాణం లో ఉన్న అదనపు తరగతి గదులు, త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, కాంపౌండ్ వాల్స్, తరగతి గదుల్లో ప్లోరింగ్ తదితర పెండింగులో ఉన్న పనులను మే 31 లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడం లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకుబ్రేక్
ఈ కార్యక్రమంలో జెడ్పీ సి ఈ ఓ విజయ లక్ష్మి మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు