పెందుర్తి:పరవాడ మండలం కన్నూరు పంచాయతీ మడకపాలెం గ్రామం లో గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాధ్ , పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు. సుమారు 76 లక్షల రూపాయలు నిధులు తో మంజూరైన మంత్రిపాలెం నుండి మడక పాలెం వరుకు నిర్మిస్తున్న బి.టి రోడ్డు ను ప్రారంభించారు.
అనంతరం సుమారు 8.65 లక్షల రూపాయిల నిధులు తో అంగన్వాడీ భవనాన్ని పెందుర్తి ఎమ్మె ల్యే అదీప్ చేతుల మీదుగా ప్రారంభిం చారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపా తంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్ర మాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏదయినా ఉందంటే అది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు.