భూమా అఖిలప్రియకు బెయిల్
కర్నూలు
టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు కోర్టులో ఊరట లభించింది. మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అఖిలప్రియ కర్నూలు మహిళా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ లభించడంతో ఆమె సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. తొలుత నంద్యాల కోర్టులో అఖిలప్రియ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే బెయిల్ ఇవ్వడానికి నంద్యాల కోర్టు తిరస్కరించింది. దీంతో వారు కర్నూలు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో కర్నూలు కోర్టు వద్దకు అఖిలప్రియ అభిమానులు చేరుకున్నారు.