అచ్చంపేట నియోజకవర్గం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, బలుమూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చేరుకుంది. భాజా భజంత్రీలు, డప్పులు, కొమ్ముబూరలు వాయిస్తూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భట్టికి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో లంబాడ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేసి హోరేత్తించారు.
తెలంగాణ ఆశయల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
అభిమానుల కోరిక మేరకు కొమ్ము బూరను ఉంది సర్కార్ పై జంగ్ సైరన్ మోగించారు. నర్సాయిపల్లి గ్రామస్తుల ప్రేమాభిమానాన్ని ఎన్నటికి మర్చిపోనని భట్టి తెలిపారు.