మంథని
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు,బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మంథని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్య ప్రకాష్ మాట్లాడుతూ నాడు తెలంగాణ బిల్లును పూర్తిస్థాయిలో సమర్ధించి సుష్మా స్వరాజ్ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారని అమృత త్యాగాలను విస్మరించి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం చేస్తుందని త్వరలోనే వీరికి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ జనరల్ సెక్రెటరీ సబ్బని సంతోష్, కో కన్వీనర్ నాంపల్లి రమేష్,ముత్తారం మండల ఇన్చార్జి పోతారవేని క్రాంతి,సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, చీదురాల మధుకర్ రెడ్డి, రాపర్తి సంతోష్, కాసిపేట సంతోష్, మల్లికార్జున్, లక్ష్మణ్,నారమల్ల కృష్ణ,సూర్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.