మదనపల్లె
ఫిబ్రవరి 20న మదనపల్లెలో జరుగు బహుజన రాజ్యాధికార చైతన్య యాత్ర ముగింపు సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతం పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె బిఎస్పి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సహదేవ, జిల్లా ఇన్చార్జి బాలాజీ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పునీత్, జిల్లా సెక్రటరీ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ రాజ్యాధికార చైతన్య యాత్ర మదనపల్లి పట్టణంలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీగా మొదలై మిషన్ కాంపౌండ్ నందు సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభతో ముగుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.