Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బతికుండగానే కుమార్తెకు కర్మకాండలు.

0

కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటారు. బాగా చదివించి ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా కలలు కన్నారు. కూతురును బాగా చదివించి.. తమ స్థాయికి తగ్గ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ కూతురు ఓ అబ్బాయిని ప్రేమించింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారికది నచ్చలేదు. వద్దని వారించారు. అయినా వినని కూతురు.. అతడితో వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

బాపట్లలో దారుణం.. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు..

తమను కాదని ఇంట్లోంచి వెళ్లిపోయిన కూతురు.. చనిపోవడంతో సమానం అని భావించారు. ఈక్రమంలోనే ఆమె ఫొటోకు దండ వేసి కర్మకాండలు జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని హనుమాపురంలో నివాసం ఉంటుంన్న గొల్ల పెద్ద నాగన్న, ఉరుకుందమ్మ దంపతులకు ముగ్గరు కుమార్తెలు. అయితే వీరి పెద్ద కుమార్తె ఇందు.. అదే మండలం వెంకటగిరికి చెందిన ఉరుకుందు అనే యువకుడిని ప్రేమిచింది. అదే విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే వారు కూతురు ప్రేమను అంగీకరించలేరు.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని పెళ్లి చేసుకోనివ్వమంటూ పట్టు పట్టారు. దీంతో భయపడిపోయిన యువతి.. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒ వైపు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే.. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికుల ఇద్దరినీ పిలిపించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఇందు తల్లిదండ్రుల మాట వినలేదు. ఇద్దరూ మేజర్లు కావడంతో అధికారులు వారిద్దరినీ స్టేషన్ నుంచి పంపించి వేశారు.

 

కూతురు ఇందు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు.. తమ కూతురు ఇందు 07-06-2023న చనిపోయందని ఓ చిత్రపటాన్ని తయారు చేయించారు. అనంతరం ఆ చిత్రపటానికి పూల మాలలు వేసి ఇ్టమైన ఆహార పదార్థాలు చిత్ర పటం ముందు ఉంచారు. కొబ్బరికాయ కొట్టి, కర్మకాండ జరిపించారు. పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమకు అన్యాయం చేసి వెళ్లిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ తతంగాన్ని అంతా ఎవరో వీడియో తీసి నెట్టింట పెట్టారు.

లవర్ తో కలిసి భర్త హత్య.

ఇది కాస్తా వైరల్ గా మారింది. ఎక్కడ చూసిన  ఈ వీడియో, ఫొటోలే కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అనే యువతి అదే గ్రామానికి చెందిని వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరు ఇద్దరూ సమీప బంధువులే. వీరి మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని అనుకొని ఇద్దరూ వారి వారి ఇళ్లలో పెద్దలను ఈ విషయం చెప్పారు. తాము ఇద్దరం ఒకర్నొకరు ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని కోరారు. అందుకు పెద్దలు ససేమిరా అన్నారు. ఎంత నచ్చచెప్పినా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక ఎవరికి తెలియకుండా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

 

జనవరి 13న స్థానికంగా ఓ గుడిలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారుఈ విషయం యువతి ఇంట్లో తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో వారిని కూడా కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ పెళ్లితో ఆమె చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఆయన తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి అర్పించాడు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేని తండ్రి చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie