ఈరోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు.. ఆ మాటకొస్తే మన నీడను కూడా నమ్మడానికి వీలు లేదు.. ప్రేమ పేరుతో చాలా మంది మోసపోతున్నారు.. కిలాడీలు ప్రేమ పేరుతో వల వేసి సమయం దొరికితే అసలు రంగు బయటపెడుతూ దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ మహిళ ప్రేమ పేరుతో దగ్గరయ్యింది.. పార్టీ పేరుతో పిలిచింది.. నమ్మి వెళ్తే నట్టేట ముంచింది. ఉన్నదంతా లాగేసుకుంది. పైగా చిత్రహింసలు పెట్టింది.
ప్రియురాలు ఇచ్చిన ట్విస్ట్‌కు ఇప్పుడు షాక్ అవుతున్నాడు ఓ యువకుడు.. కర్నాటకలోని బెంగళూరులో వెలుగు చూసింది..బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయ్, భావనా రెడ్డి ఇద్దరూ ప్రేమించుకున్నారు.అయితే, చిక్‌బల్లాపూర్ జిల్లా నందిహిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్‌కు వెళ్దామంటూ విజయ్‌ను భావన తీసుకెళ్లింది. అయితే, ప్రియురాలే కదా పిలిచింది అని నమ్మి వెళ్లిన విజయ్‌కి అక్కడ మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఎదురైంది. భావన మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి విజయ్‌ను రిసార్ట్‌లోనే కిడ్నాప్ చేసింది.
రౌడీ షీటర్ హత్యకేసులో ముగ్గురు అరెస్టు.
మూడు రోజుల పాటు గదిలో బందించి డబ్బులు వసూలు చేసింది..అంతటితో ఆగకుండా అతన్ని నానా హింసలు పెట్టింది.. అతడికి అందం వల వేసి చుక్కలు చూపించింది.. ఇక అడ్డంగా బుక్కయ్యాడు..ఇక చేసేదేమి లేకపోవడంతో ఉన్నది మొత్తం ఇచ్చుకున్నాడు.. అతని నుంచి దాదాపు రూ. 21 లక్షలు వివిధ ఖాతాల్లోకి బదిలీ చేయించింది. విజయ్ కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసును కూడా దోచుకున్నారు.
ఆ తరువాత ఏదోలా వారి చెరనుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రాయించారు.. ఇక రంగంలోకి దిగిన పోలుసులు కిలాడిని అదుపులోకి తీసుకున్నారు… జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు.. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె నుంచి డబ్బులను వసూల్ చేశారు..కొన్ని సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు..