హైదరాబాద్, మే 17
బ్రాహ్మణ సదనం నిర్మాణ కార్యక్రమంలో బ్రాహ్మణులంతా పాల్గొనాలని బ్రాహ్మణ పరిషత్ పిలుపు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి ముస్తా బైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఈ భవనాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణలోని బ్రాహ్మణ సంఘాలతో బ్రాహ్మణ పరిషత్ సమావేశం నిర్వహించింది. విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.10 ఎకరాల స్థలంలో భవనాన్ని నిర్మించారు.
పీఠాధిపతులు, ఇతర అతిథులు ఉండటానికి గదులు, భోజన సదుపాయాలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు, హంగులతో బ్రాహ్మణ సదన్ నిర్మాణం జరగనుంది.పెళ్లిళ్లు, ఉపనాయనాలతో సహా ఇతర శుభకార్యాలు నిర్వహించుకునే విధంగా, 600 మంది కెపాసిటీతో కళ్యాణ మంటపం నిర్మాణం చేపట్టారు.ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేశారు. మూడంతస్తుల ఆడిటోరియం(ఫంక్షన్ హాలు), సమాచార కేంద్రం, మఠాధిపతులు, పీఠాధిపతుల విడిది సదనం మొదలైనవి ఇందులో ప్రధానమైనవి. రూ.10 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు రూ.9.43 కోట్లు దీనికోసం ఖర్చు చేశారు.