కడప:కడపజిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప కర్నూల్ జాతీయ రహదారిపై జగన్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకుపోయింది. ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరికి కాలు విరిగింది. దాదాపు 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో ఘటన జరిగింది. బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసారు. గాయాలపాలైన వారిని స్థానిక108 లో పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.