విజయవాడ:చిన్న పిల్లతో అసభ్యంగా ప్రవర్తించి ఆత్మహత్య చేసుకునేలాగా చేసిన నిందితుడు వినోద్ కుమార్ జైన్ @ వినోద్ జైన్ కు విజయవాడ పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి డా. ఎస్. రజిని జీవితకాలం కఠినకారాగార శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.ఎన్.టి.ఆర్ జిల్లా భవానిపురం పోలీస్ స్టేషన్ పరిదిలోని కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని అపార్ట్మెంట్ లో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. ఫిర్యాది రెండవ కుమార్తె కుటుంబం కూడా అదే అపార్ట్మెంట్ లో రెండవ ఫ్లోర్ లో నివాసం ఉంటుంది. , ఫిర్యాది ప్రతిరోజూలాగానే గత యేడాది జనవరి 29 తేదిన సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక పాప అపార్ట్మెంట్ టెర్రస్ నుండి కిందకు దూకి చనిపోయినట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఆ పాప తన రెండవ కుమార్తె కూతురని తేలింది.
వెంటనే ఎం జరిగిందో అని పాప గదిలోకి వెళ్లి చూడగా మంచంపై ఒక పుస్తకం ఉన్నట్లు దానిలో గత రెండు నెలలుగా అదే అపార్ట్ మెంట్ లో నివసించుచున్న వినోద్ కుమార్ జైన్ అను వ్యక్తి పాప ప్రైవేట్ పార్ట్ లను తాకూతూ, బూతులు మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూన్నాడని ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్రమనస్తాపానికి గురై చనిపోతున్నాను అని సూసైడ్ నోట్ రాసివుందిజ ఈ సదరు విషయం పై పోలీసులకు పిర్యాదు చేసారు. భవానిపురం పోలీసులు విచారణ చేసారు.
నిందితుడు వినోద్ కుమార్ జైన్ @ వినోద్ జైన్ (50 సం.) ను గొల్లపూడి బైపాస్ రోడ్ వద్ద అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది.
కేసులో సాక్షాధారాలను పోలీసులు సమర్దవంతంగా కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి కఠిన శిక్ష పడింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జి. నాగి రెడ్డి. జి.నారాయణ రెడ్డి. , సి.యమ్.ఎస్. ఇనస్పెక్టర్, భవానిపురం ఎస్.ఐ.ఎల్.ప్రసాద్, .యమ్.ఎస్. సిబ్బంది పర్యవేక్షణలో 20 మంది సాక్షులను విచారించారు.