Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పల్నాడులో జాన్ బీ శపధం.

0

అది పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట. పల్నాడు పగ, ప్రతీకారాలకు పెట్టింది పేరు. ఒక్కసారి శపథం చేశారంటే.. ఆ మాటకు కట్టుబడి ఉంటారంతే.. అలా జరిగిందే ఈ ఘటన.. ఓ మహిళ శపథం చేసి మరి ప్రతీకారం తీర్చుకుంది. నర్సరావుపేట పట్టణంలోని ఎస్ ఆర్ కే టీ కాలనీలో జాన్‌బీ అనే మహిళ నివసిస్తుండేది. అదే కాలనీలో ఉండే బాజీతో వివాహేతర సంబంధం ఉంది. బాజీ పై రౌడీ షీట్ ఉంది. ఈ వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న జాన్‌బీ కొడుకు సుభానికి తెలిసింది. దీంతో బాజీ ఆస్తిలో వాటా కావాలంటూ సుభానీ వేధించడం మొదలు పెట్టాడు.వేధింపులు తట్టుకోలేని బాజీ ఒకరోజు సుభానీకి మద్యం పోయించి హత్య చేశాడు. పాల వ్యానులో మృతదేహాన్ని పడేశాడు.

 

ఈ విషయం తెలుసుకున్న జాన్ బీ.. బాజీతో గొడవ పడింది. తన కొడుకు అడ్రస్ చెప్పాలంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో బాజీ సుభానీని చంపినట్లు ఒప్పుకొని మృతదేహాన్ని చూపించాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన జాన్ బి కన్నీరు మున్నీరుగా విలపించింది. అదే కొడుకు మృతదేహం వద్ద తన కొడుకును చంపిన వారినందరినీ చంపి తీరుతానని శపథం చేసింది.అప్పటినుంచి తన పగ తీర్చుకునే పనిలో పడింది. ఎనిమిది నెలల కిందట సుభాని హత్య కేసులో బాజీకి సహకరించిన అల్లా కాశీంను తన అనుచరులతో కలిసి హత్య చేసింది.

ఐ ప్యాక్ ఎఫెక్ట్.. కార్యరంగంలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..

ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో గడిపివచ్చింది. అనంతరం తన కొడుకును పొట్టన పెట్టుకున్న బాజీని హత్య చేసేందుకు సిద్దమైంది‌. నిన్న ఒంటరిగా దొరికిన బాజీ కళ్ళలో కారం కొట్టి మరీ చంపేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు.స్థానికులు గమనించడంతో మృతదేహంపై మట్టి పోసి అక్కడ నుండి జారుకున్నారు. రౌడీ షీటర్ బాజీ హత్యతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie