నంద్యాల
నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడి భుజానికి డాక్టర్లు ఏంఆర్ఐ స్కాన్ చేసారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయం అయింది.
అప్పటి నుండి లోకేష్ నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్లు సూచించారు.