తిరుపతి
నగరపాలక పరిధిలో గృహనిర్మాణాలు వేగవంతం కావలని తప్పనిసరి ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకంతో లక్ష్యాలు నిర్దేశించుకుని పురోగతి ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో నగరపాలక పరిధిలో నిర్మాణాలు జరుగుతున్న గృహాల పురోగతిపై నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తో కల్సి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహనిర్మాణాలకు నీరు , మెటీరియల్ , అప్రోచ్ రోడ్లు సౌకర్యం వుందని లేబర్ కూడా అందుబాటులో వున్నారని ప్రణాళికా బద్దంగా లక్ష్యాలు నిర్దేశించి ప్రతి రోజు కనీసం స్టేజ్ కన్వర్షన్ పై మూడు సార్లుగా సమీక్షించాలని సూచించారు. మరో మూడు నెలల్లో వర్షాలు వస్తే మరల పనులు ఆగుతాయని నోడల్ అధికారి నియామకంతో గృహనిర్మాణాలు వేగావంతం చేయాలని అన్నారు. ఇంకా దాదాపు 11 వేలమందికి ఐ ఐ సి బ్యాంక్ ఖాతాలకు లోన్ ఋణం మంజూరు చేయాల్సి వుందని అన్నారు. పేదలకు అందించే గృహాలు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చి పురోగతి తీసుకురావాలని అన్నారు.
ఈనెల 10న రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలతో అఖిలపక్ష సమావేశం
నగరపాలక సంస్థలో మంజూరుచేసి కేటగిరి 3 తో కాంట్రాక్టర్ ద్వార నిర్మాణాలు జరుగుతున్నచిందే పల్లి , జి.పాలెం , కల్లూరు , ఎం.కొత్తపల్లి , సూరప్పకశం , పిసి అగ్రహారం లే ఔట్లలో వసతులు పై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో హౌసింగ్ పి డి వెంకటేశ్వర్లు, మునిసిపల్ ఇంజనీర్ చంద్ర శేఖర్ , డి ఇ లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్ , గోమతి , దేవిక , మహేష్ తదితరులు పాల్గొన్నారు.