మంథని
ఎక్లాస్ పూర్ గ్రామంలో ఎస్సీ మాల దళితులకు ఇచ్చిన భూములను అధికారులు లాక్కోవడం అన్యామని పేర్కొంటూ గురువారం మంథని మండలం ఎగ్లాస్ పూర్ దళితుల భూముల మొకపై మాల కులానికి చెందిన దళితులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో సర్వేనెంబర్ 37/1,2,3, నెంబర్లలో 1987లో దళితులకు ప్రభుత్వం రెండు గుంటలు చొప్పున నివాస స్థలాల కోసం భూమి కేటాయించింది. దళితుల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వారు గృహాలను నిర్మించుకోలేదు. సుమారుగా 40 ఏళ్లుగా దళితుల స్వాధీనంలోనే ఈ భూమి ఉంది.ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ భూములు బీడులుగా ఉంటున్నాయని చదును చేస్తూ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ట్రాక్టర్లతో చదును చేయిస్తుంది.ఇది గమనించిన దళిత కుటుంబాలు మూకుమ్మడిగా రెవెన్యూ అధికారినితో వాగ్వ్యదానికి దిగారు.
1987లో దళితులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆ పత్రాలను అధికారులకు చూపించారు.ఈ భూమిని ప్రభుత్వo స్వాధీనం చేసుకుని ఓపెన్ హౌస్ ప్లాట్లను పెడతామని అధికారులు చెప్తున్నారు. ఇది తమ సర్వేనెంబర్ అంటూ దళితులు పత్రాలు చూపించి ఆందోళనకు దిగారు. భూములు లాక్కుంటే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ ఆర్ ఐ వెనుతిరిగి వెళ్లిపోయారు. గ్రామ స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికార పార్టీ నాయకుల చోరవతోనే ఇదంతా జరుగుతుందని, ప్రభుత్వం మాకు కేటాయించిన భూములను మాకు ఇవ్వాలని,లేని ఎడల ఆందోళన చేపడతామని దళితులు హెచ్చరించారు.