తెలంగాణ ఆశయల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
హైదరాబాద్
గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నివాళులర్పించారు. తరువాత ఆమె కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు.
మీరా కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు ,ఆశాయాలు కాంగ్రెస్ కు మాత్రమే తెలుసని అన్నారు..