న్యూఢిల్లీ ఫిబ్రవరి 13,
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని కరంపురాలోని మోతీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్మాగారంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 27 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక చర్యలు చేపడుతున్నాయి.
తెల్లవారుజామున ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో అగ్నిప్రమాదం జరిగింది.అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 16 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటిప్రాణనష్టం జరగలేదు.