Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ రాయలసీమ డెక్లరేషన్

0

తిరుపతి, జూన్ 8

యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్…పదిహేను వందల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశారు. రాయలసీమ లోని మూడు ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కడపలో రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే..ఎలా ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగు పరుస్తామో.. తమ వద్ద ఉన్న ప్రణాళికలేమిటో.. వనరులు ఎలా సమకూర్చుకుంటామో లోకేష్ వివరించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పాదయత్ర ద్వారా తెలుసుకున్న కష్టాలను తీర్చడానికే డిక్లరేషన్ ను రెడీ చేశామని లోకేష్ ప్రకటించారు. రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున విద్య, ఉపాధి అవకాకాశాల కోసం తరలి పోతున్నారని.. సాగునీటి కోసం ఇబ్బంది ప డుతున్నారని ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సమగ్రమైన ప్రణాళికలను రెడీ చేశామని లోకేష్ తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా స్థానికంగానే యువతకు ఉపాధి కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

పవన్ ప్రకటనలతో వైసీపీలో కలవరం.

చదువుకోని వారి కూడా ఉపాధి కలిగేలా.. పశువుల పెంపకం యూనిట్లు పంపిణీ చేయడమే కాకుండా.. వాటికి మేత కోసం బంజరుభూముల్ని కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. రాయలసీమలో సాగు మీద ఆధారపడిన రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడాన్ని లోకేష్ మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ఇందు కోసం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తామో వివరించారు. రైతులు తమ పొలంలో విత్తు విత్తిన దగ్గర్నుంచి పంట అమ్ముకునే వరకూ ప్రభుత్వమే అండగా ఉంటుందన్నారు. రైతులకు వ్యవసాయం చేసేందుకు శాస్త్రీయమైన విధానాలను అందుబాటులోకి తెస్తారు. ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని.. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లకు చేయూత అందిస్తామని లోకేష్ ప్రకటించారు. అలాగే రైతులు తాము పండింటిన పంటను స్వయంగా అమ్ముకోవడానికి ప్రతి నలభై కిలోమీటర్ల పరిధిలో ఒక రైతు బజార్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

 

రాయలసీమలో ఉద్యానపంటలు ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్.. రాయలసీమ రైతుల్ని ఆకట్టుకునేందుకు డిక్లరేషన్ లో ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ ప్రజలకు నీటి కొరత అనేది అనాదిగా ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రాయలసీమలో ప్రతి ఒక్కరికి నీటి హక్కు కల్పిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రతి ఎకరాకు తాగునరిస్తామని.. ప్రతి ఒక్క రైతుకూ సాగునీరివ్వడం లక్ష్యమని రాయలసీమ డిక్లరేషన్ లో ప్రకటించారు. ఇందు కోసం పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రతిపాదిక పూర్తి చేస్తామన్నరు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇక రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి తన విజన్ ను లోకేష్ ఆవిష్కరించారు. జోనల్ ప్లానింగ్ తో ఉపాధి కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాయలసీమ యువత వలసలను ఆపేసి.. ఉపాధి గుమ్మంగా రాయలసీమను మార్చాలన్న విజన్ ను లోకేష్ ప్రకటించారు.

చంద్రబాబుపై మారుతున్న ఏపీ బీజేపీ నేతల స్వరం

కర్నూలు జిల్లాలో వ్యవసాయ పరికరాల తయారీ హబ్, బెంగళూరు – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కేంద్ర బిందువుగా కర్నూలును మార్చి పరిశ్రమల్ని ఆకర్షించడం అలాగే వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బిందువుగా కర్నూలును మార్చాలని తన డిక్లరేషన్ లో లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ, అంతర్జాకీయ క్రీడాకారులను తీర్చి  దిద్దే స్పోర్ట్స్ యూనివర్శిటీ హబ్‌గా కడపను మారుస్తామని లోకేష్ ప్రకటించారు. చిత్తూరును ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా.. అనంతపురంనుంచి ఆటోమోబైల్ తయారీ రంగం హబ్‌గామార్చాలనే డిక్లరేన్ ను లోకేష్ ప్రకటించారు.రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టుల గురించి లోకేష్ వివరించారు. గత నాలుగేళ్లకాలంలో సీమ యువత ఎలా నష్టపోయిందో వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ యువత అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie