టీడీపీ మహానాడు విజయవంతం
కాకినాడ
కాకినాడ సూర్య కళామందిరంలో నిర్వహించిన మినీ మహానాడు విజయవంతం కావడంతో జిల్లా టీడీపీ నేతల్లోను, కార్యకర్తల్లో మిన్నంటిన ఉత్సాహం నింపింది. కాకినాడ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడును నిర్వహించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి, ప్రత్తిపాడు టిడిపి ఇన్చార్జిగా వ్యవహరించిన దివంగత పరుపుల రాజా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సభకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో టీడీపీకి తమ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ఉవ్వెత్తున ప్రజాదరణ లభిస్తుందని, అలాగే యువనేత లోకేష్ నెరవేస్తున్న యువగళం పాదయాత్రకు విశేష స్పందనను రాష్ట్ర ప్రజలు కనబరుస్తున్నారన్నారు. . టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్నో పథకాలకు ఆజ్యుడని ప్రజల వద్దకే పాలనను తెచ్చిన మహనీయుడని కొనియాడారు.
అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్
మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారన్నారు. . మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యంను వైకాపా ప్రభుత్వం నడిపిస్తుందన్నారు. తప్పు చేసిన వాళ్ళు కాకుండా చేయని వాళ్ళు జైల్లో ఉంటున్నారని ఇది జగన్ ప్రభుత్వ విధానమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చిక్కాల రామచందర్రావు, వనమాడి వెంకటేశ్వరరావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మిలతో పాటు నాయకులు యనమల దివ్య, వరుపుల సత్యప్రభ, పేరాబత్తుల రాజశేఖర్, మోకా ఆనంద్ సాగర్, సుంకర పావని తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు..