Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ, జనసేన  కలిసే పోటీ..

0

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి వెళ్లడం ఖాయమన్న అభిప్రాయం ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో బలంగా ఉంది. జరుగుతున్న పరిణామాలు, ఇటు టీడీపీ.. అటు జనసేన నుంచి వస్తున్న సంకేతాలు కూడా ఆ అభిప్రాయాలకు బలం ఇస్తున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటూ పవన్ చేస్తున్న ప్రతిపాదనకు ఆయన మిత్రపక్షం బీజేపీ సంగతేమో కానీ.. టీడీపీ మాత్రం సై సై అంటోంది. కలిసి వెళితే కొట్టేస్తాం… ఇక మనకు తిరుగే లేదనుకుంటోంది పసుపు పార్టీలోని ఓ వర్గం. కానీ…అదే పార్టీకి చెందిన మరికొంతమంది నేతల ఆలోచన మాత్రం పూర్తి భిన్నంగా ఉందట. మన ఎత్తులు మనకుంటే చాలు… వాళ్ళతో పొత్తుల అవసరమే లేదని వాదిస్తున్నారట ఆ నాయకులు.

 

ఆల్‌ ఈజ్‌ వెల్‌. అంతా సెట్‌ అనుకుంటున్న టైంలో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు లేనిపోని బీరాలని ఎవరైనా అడిగితే…వాళ్ల వెర్షన్‌ డిఫరెంట్‌గా ఉందట. గతంతో పోల్చుకుంటే టీడీపీకి మంచి మైలేజ్ వచ్చిందని, జనం స్పందన అద్భుతంగా ఉంటోందని, అలాంటప్పుడు వేరే వాళ్ళతో కలిసి వెళ్లి మనల్ని మనమే తక్కువ చేసుకోవడం ఎందుకన్నది ఆ నాయకుల వైఖరిగా చెబుతున్నారు. దీంతో పొత్తుల వ్యవహారంపై టీడీపీలో కాస్త గందరగోళం ఉన్నట్టే తెలుస్తోంది.టీడీపీలో ఈ తరహా చర్చ జరగడానికి వేరే కారణాలున్నాయట. గతంతో పోల్చుకుంటే జనసేన, పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతోందన్నది కొంత మంది టీడీపీ నేతల విశ్లేషణగా చెబుతున్నారు.

 

పవన్‌ గతంలో తన బలాలు, బలహీనతల గురించి చెప్పారని, ఈసారి తాను సీఎంగా ఉండడం అసాధ్యమనే విషయాన్ని తన కేడర్‌తో పాటు ప్రజలకు కూడా వివరించారని అంటున్నారు. అంతా అయ్యాక.. మళ్లీ ఇప్పుడు వారాహి యాత్రలో ఇంకో రకంగా మాట్లాడ్డం చూస్తుంటే…మిగతా ప్రజలతో పాటు కాపు సామాజిక వర్గంలో కూడా నెమ్మదిగా పవన్‌ మీద నమ్మకం సన్నగిల్లుతోందన్నది వాళ్ళ వెర్షన్‌. తాను గతంలో వివిధ మీటింగ్స్‌లో ఏ విషయాన్ని అయితే చెప్పారో.. వారాహి యాత్రలో కూడా అదే చెప్పి ఉంటే.. పవన్‌కళ్యాణ్‌ ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికే కట్టుబడి ఉన్నారన్న అభిప్రాయం కలిగేదని, అలా కాకుండా…. అప్పుడొకలా, ఇప్పుడొకలా మాట్లాడ్డం ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీస్తోందన్నది ఆ టీడీపీ నేతల అభిప్రాయం అట.

అడ్డూ, అదుపు లేకేండా అక్రమ నిర్మాణాలు..

ఈ పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం కంటే విడిగా పోటీ చేయడమే బెటరని పార్టీ నాయకత్వానికి గట్టిగానే చెబుతున్నారట కొందరు టీడీపీ నేతలు. పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి పాతిక సీట్లిచ్చి.. వాటిల్లో మెజార్టీ సీట్లు ఓడిపోతే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని వారు వాదిస్తున్నట్టు తెలిసింది. 2009లో మహాకూటమి ఏర్పాటు చేసి బీఆరెస్‌కు కేటాయించిన వాటిలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పవన్‌కు ఎక్కువ కేటాయించి.. వాటిల్లో మెజార్టీ సీట్లు కోల్పోతే… 2009 సీన్ రిపీట్ అవుతుందేమోనన్న భయం కూడా టీడీపీ వర్గాల్లో ఉందట. అందుకే విడివిడిగా పోటీ చేస్తేనే మంచిదంటున్నారట సదురు నేతలు. అయితే.. ఇలాంటి సూచనలు చేసే వాళ్లలో ఎక్కువ మంది పొత్తు ఉంటే మా టిక్కెట్లు గల్లంతవుతాయని భయపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. చివరికి ఎవరి మాట నెగ్గుతుందో… టీడీపీ నాయకత్వం ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie