ఆంధ్రప్రదేశ్‌లో కనపడని 2000 రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్‌లోనే..,టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు
అమరావతి మే 20
2000 రూపాయల నోట్ల రద్దుపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కనపడని 2000 రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు వెదజల్లడానికి జగన్ రూ.2000 నోట్లు లక్షల కోట్లలో దాచుకున్నారని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఏస్టేట్, లోటస్ పాండ్, బెంగళూరు ఎలహంకా నివాసాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2000 నోట్లు మార్పిడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 30లోపు జగన్, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ మార్గాల గుండా 2000 రూపాయల నోట్లు మార్చడానికి సిద్ధమయ్యారని తమ దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. రెండువేల రూపాయల నోట్ల రద్దుతో నిన్న రాత్రి నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు.