Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జూలై నుంచి జనాల్లోకి  చంద్రబాబు..

0

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వ్యవహారాల్లో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించడంతో పాటు అంతర్గత విభేదాలన పరిష్కరించడాని కసరత్తు చేస్తున్నారు. జులై రెండో వారం నుంచి మళ్లీ జనంలోకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల నియమించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నేతల గ్రాఫ్ పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలను పరిష్కారించడం, పార్టీలో చేరికలు, భవిష్యత్ కు గ్యారెంటీ పై ప్రచార కార్యక్రమం వంటి అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు.

 

ఎన్నికలు మరో 9నెలల దూరంలోకి వచ్చేయడంతో నియోజకవర్గ ఇంచార్జ్ ల నియామకంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఇంచార్జ్‌లతో రెండో దఫా రివ్యూలు పూర్తి చేశారు. నియోజకవర్గాల్లో ఇంచార్జ్ ల నియామకాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే 43 అసెంబ్లీ ఇంచార్జ్‌లతో రెండో దఫా సమీక్షలు పూర్తి చేశారు.ఇంచార్జ్ ల నియామకంపై కొన్ని స్ధానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ నిర్ణయాలు తీసుకున్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కన్నా లక్ష్మీ నారాయణను ఇంచార్జ్ గా నియమిస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయించాురు. ఇటీవల జి.డి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా వి.ఎం. థామస్, పూతలపట్టు ఇంచార్జ్ గా కలికిరి మురళీ మోహన్‌లను నియమించారు.

ఏపీలో శృతి మించిపోతున్న డిజిటల్ క్యాంపెయిన్స్..

వర్గ పోరు ఉన్న స్థానాలపైనా పార్టీ అధినేత ఫోకస్ చేశారు. గోపాలపురం నియోజక వర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలకు ముగింపు పలకేందకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. గోపాలపురం ఇంచార్జ్ వెంకటరాజు, పార్టీ నేత బాపిరాజులకు పిలుపు అందింది.గుంటూరు జిల్లా ప్రత్తిపాడు (ఎస్సీ) స్థానానికి ఇటీవలి వరకూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు రేసులో ముందున్నారు. కానీ తాజాగా సమీకరణలు మారినట్లు కనిపిస్తోంది. ఆయన అల్లుడు రాజేశ్‌ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెరపైకి వచ్చారు. బుధవారం ఆయన ఇక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడారు. రామాంజనేయులు కూడా విడిగా అధినేతను కలిశారు. ఈ కుటుంబంలో ఎవరో ఒకరికే అవకాశం వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజు, పశ్చిమ గోదావరి జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజును ఆయన బుధవారం పిలిపించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును మార్చి వెంకటరాజును నియమించడంపై బాపిరాజు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ నేతలను పిలిపించి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను’ అని బాపిరాజు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది.నియోజకవర్గంలో సమస్యలను చక్కదిద్దే బాధ్యతను ఒకరిద్దరు సీనియర్‌ నేతలకు అప్పగించే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు చేరికను నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి మొదట వ్యతిరేకించారు.

 

చంద్రబాబు పిలిపించి మాట్లాడాక అంగీకారం తెలిపారు. ఎస్‌సీవీ నాయుడు గురువారం ఇక్కడ అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. విభేదాలున్న ఇంకో రెండు నియోజకవర్గాలపై త్వరలో సమావేశాలు జరుగనున్నాయి.మరోవైపు పార్టీలో చేరికలపైనా పార్టీ అధినేత దృష్టిపెట్టారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడును టీడీపీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్ కు గ్యారెంటీ పై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు రూపొందించారు.

విద్యార్థులతో అంబటి రాయుడు మమేకం.

.‘ఇదేం ఖర్మ కార్యక్రమం’ కింద ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 13 లోక్‌సభ స్థానాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటనలు సాగాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరో విడత పర్యటనలకు ఆయన ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. జూలై రెండో వారం నుంచి ఆయన పర్యటనలు ప్రారం భం కావచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.యువగళం పాదయాత్ర ఒకవైపు….భవిష్యత్ కు గ్యారెంటీ పై చంద్రబాబు ప్రచార యాత్రలు మరోవైపు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే ఐదు జోన్లలో భవిష్యత్ కు గ్యారెంటీ నేతల చైతన్య రథ యాత్రలు నిర్వహించారు.ఇన్‌చార్జులు మరింత చురుగ్గా పనిచేయడానికి చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలు ఉపకరిస్తున్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అధినేత తమను గమనిస్తున్నారని తెలియడంతో ఇన్‌చార్జులు కూడా క్రియాశీలమయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie