జీడి యాజమాన్యం జీడి పరిశ్రమలు బంధు పేరుతో అటు రైతాంగాన్ని ఇటు కార్మికుల్ని తీవ్రంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుందని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్ మూర్తి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్ రావు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ జీడి యాజమాన్యాలు జూలై ఐదు నుండి ఆగస్టు 1 వరకు జీడి పరిశ్రమలు బందు పేరుతో యాజమాన్యాలు జీడి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని వారు
విమర్శించారు.బందు పేరుతో నాటకాలు ఆడి అతి తక్కువ ధరకు జీడిపిక్కలు తీసుకోవడానికి డ్రామాలాడుతున్నారని వారు ఆరోపించారు.
ఆత్మకూరు లో అట్టహాసంగా ప్రారంభమైన నూతన బస్టాండు.
రైతులకు రెట్టింపు ఆదాయం ఇస్తామని ప్రగల్బాలు పలికిన బిజెపి రైతు ప్రభుత్వం అంటున్న వైసీపీ జీడీకి మద్దతు ప్రకటించి ఎందుకు కొనుగోలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. జీడి పరిశ్రమలు బంధు చేస్తామని వ్యాపారులు ప్రకటనపై జిల్లా మంత్రులు ,స్పీకర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు .జీడి రైతాంగం గిట్టుబాటు ధరపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని వారు ప్రశ్నించారు. మౌనం వీడి గిట్టుబాటు ధరపై మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆర్బికే లద్వారా జీడిపిక్కలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు .జీడి 80 కేజీలు బస్తాకు 16 వేల రూపాయలు ఇవ్వాలని కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . జీడి పంటకు మద్దతు ధర వచ్చేవరకు ప్రజల మద్దతుతో దశలవారి పోరాటం చేస్తామని హెచ్చరించారు.