సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జహీర బాద్ మున్సిపాలిటీ పరిధిలో హోతి (కే) లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం లో నిర్మాణ పనులు మంత్రి హరీష్ రావు గురువారం పరిశీలించారు. వేగంగా ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలని అధికారులకు ఆదేశించారు. తరువాత అయన జహీరాబాద్ పట్టణంలో ఆరెకటిక సంఘం నూతన భవనానికి శంకుస్థాపన చేసారు. ఇదే కార్యక్రమంలో నూతనంగా నిర్మిస్తున్న పద్మశాలి భవన పనులను కుడా మంత్రి పరిశీలించారు. అయన వెంట జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఇతర అధికారులు వున్నారు.