జనగణమన టీమ్ బీఆర్ఎస్ లో చేరిక
జగిత్యాల
నిత్య జనగణమనతో ప్రజలను జాతీయ పండుగకు దగ్గర చేసేందుకు కృషి చేస్తున్న ఉత్తురి గంగాధర్ టీమ్ గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిత్య జనగణమన తో జగిత్యాల ప్రజలకు జాతీయ భావాన్ని పెంచేందుకు వీరు కృషిచేస్తున్నారు. వీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ని నమ్మినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు దిక్కని ధినితోనే ప్రజలకు మేలని భావించిన గంగాధర్ బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఒక్కసారిగా గంగాధర్ బీఆర్ ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ తో సహా బిజెపి పార్టీలో చర్చ మొదలైంది. జాతీయ భావాన్ని ప్రజల్లో పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న యు. గంగాధర్ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని గంగాధర్ భావిస్తున్నట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.