గుంటూరు
గుంటూరు జిల్లా గుండిమెడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తదితరులు పాల్గోన్నారు. గాదె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ గుండిమెడ గ్రామంలో ఇసుక దొంగతనం జరుగుతుంది. క్వారీ గడువు ముగిసిన ఇసుక తవ్వకాలు ఆపటం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇసుక తవ్వకాలు ఆపాలి. సీఎంకు కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోలేదు.
జెపి గ్రూపు పేరుతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక దోచుకుని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. భవిష్యత్తు తరాల ఆస్తిని దోచుకుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజీ స్టార్, ప్రజల మనిషి. ప్యాకేజీలు తీసుకుని వైసిపి నేతలు అక్రమ ఇసుక క్వారీ తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. సిఎం జగన్ కనుసన్నల్లోనే క్వారీలు ఇసుక దొంగతనం జరుగుతుందని ఆరోపించారు.
సీఎం ఇసుక దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోపొతే క్వారీలో వాట ఉందని అనుకుంటున్నాం,జన సేన తరపు ఆరోపిస్తున్నాం. ఇసుక క్వారీ అక్రమ తవ్వకాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడతారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ జనసేన పార్టీ. తక్షణమే క్వారీ తవ్వకాలు ఆపాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.