Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గవర్నర్ హుందాగా ప్రవర్తించాలి: డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

0

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, ఎం. ఎస్. ప్రభాకర్, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ సోమవారం బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రాష్ట్రం లోరైతుల ఆత్మహత్యల మీద కొందరు వ్యక్తులు, పత్రికలు,సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. అత్మహత్యలకు వాళ్లే పురి కొల్పుతున్నారు. పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గుడ్డి వ్యతిరేకత తోనే ఈ తప్పుడు ప్రచారం. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వారి లెక్కలను కూడా వక్రీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో తెలంగాణ లో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని బదులిచ్చింది. 2014 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 400 శాతం తగ్గాయి. .కొన్ని పత్రికలు తాడు బొంగురం లేని కథనాలు రాస్తున్నాయని అన్నారు. .బండి సంజయ్ తెలంగాణ లో 10 వేల ఆత్మహత్యలు జరిగాయని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రం లో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయి కి చేరుకున్నాయి. మేము ఆధారాలతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెబుతున్నాం.. ఆత్మహత్యలు పెరిగాయని చెబుతున్న వారు గుడ్డిగా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి తోమర్ ఆత్మహత్యలు తగ్గాయంటే..బండి సంజయ్ పెరిగాయంటున్నారు. వువసాయానికి కల్పిస్తున్న అనేక ప్రోత్సహాకాలు రైతుల ఆత్మహత్యలు తగ్గించాయి. .నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం లో వ్యవసాయం నెంబర్ వన్ కు చేరుకుంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం రాష్ట్రం లో వ్యవసాయం నెంబర్ వన్ కు చేరిందని అన్నారు.

.రైతు బంధు కేవలం భూస్వాములకే దక్కుతొందని కొందరు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం లో 91 శాతం సన్న చిన్న కారు రైతులే ఉన్నారు. 50 ఎకరాల పై బడి ఉన్న వారు కేవలం 0.09 శాతం మాత్రం. రైతు బంధు సాయం 81 శాతం బీసీ, ఎస్సి, ఎస్టీ వర్గాలు రైతులకే అందుతోంది. 50 శాతం బీసీ లకు రైతు బంధు సాయం అందుతోంది. కావాలనుకుంటే రైతు బంధు సాయం అందుకుంటున్న వారి పట్టాదారు పుస్తకాల వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. .ఉద్యోగాల నోటిఫికేషన్లు, కంటి వెలుగు కార్యక్రమాల పై కూడా బీజేపీ నేతలు తొర్రి మాటలు మాట్లాడుతున్నారు. కంటి వెలుగు ను ప్రఖ్యాతి పొందిన వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. వ్యవసాయ పరమైన ఆత్మహత్యలు రాష్ట్రం లో లేనే లేవు. ఇకనైనా రైతు ఆత్మహత్యల పై దుష్ప్రచారం ఆపాలని అన్నారు. బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా జరుగుతాయి. నిబంధనల ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెడతాం. విషయం ఇపుడు కోర్టు లో ఉంది..ఇంత కన్నా ఎక్కువ మాట్లాడలేమని అన్నారు. .స్వతంత్ర భారత చరిత్రలో బడ్జెట్ ఆమోదించకుండా ఉన్న సందర్భం లేదు.

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుమాట్లాడుతూ మాజీ ఐసిస్ అధికారి, రాష్ట్ర బీ ఎస్ పి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాం. ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతలను అధికారిగా ప్రవీణ్ దుర్వినియోగం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేయాలని పదవి నిస్తే తన రాజకీయం కోసం ప్రవీణ్ వాడుకున్నారు. స్వేరో వ్యవస్థను సృష్టించి భవిష్యత్ రాజకీయాల కోసం ప్రవీణ్ డబ్బులు కూడబెట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ నోట నీతులు, సిద్ధాంతం వస్తుండటం విడ్డూరం. మునుగోడు ఉప ఎన్నికలో ప్రవీణ్ ఎవరికి వత్తాసు పలికారో అందరికీ తెలుసని అన్నారు. కాన్షీరాం సిద్ధాంతాలకు మాయావతి తిలోదకాలు ఇచ్చినట్టే ప్రవీణ్ కుమార్ బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు. .తన అక్రమ సంపాదన పై ఎక్కడ విచారం జరుగుతుందో అని భయపడి మాయావతి యూపీ లో బీజేపీ కి లొంగి పోయిందని అన్నారు. క్కడ ప్రవీణ్ తంతు కూడా అలాగే ఉంది. దళితుల అభ్యున్నతి కోసం మేము పని చేస్తున్నాం. దళితుల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసే హక్కు ప్రవీణ్ కు లేదని అన్నారు.

ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ మాట్లాడుతూ .రాష్ట్రం లో గవర్నర్ ప్రతిపక్షాల లాగానే ఆధారం లేని విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ పుబ్లిసిటీ కోసం కార్యకలాపాలు చేస్తున్నారు. భద్రాచలం లో వరదలు వచ్చినపుడు ఫోటో లు దిగిన గవర్నర్ ..కేంద్రం నుంచి ఒక్కపైసా అయినా నిధులు తెచ్చేందుకు ప్రయత్నించారా. గవర్నర్ కు రాజకీయాలు చేయాలంటే ఆమె సొంత రాష్ట్రానికి వెళ్లి చేసుకోవాలి. శాసన సభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా తన దగ్గరే పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని అడిగారు. గవర్నర్ కు మద్దతుగా రాజభవన్ పరివార్ పేరిట ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి.. రాజ్ భవన్ పరివార్ కాదు. అది సంఘ్ పరివార్. ఓ మహిళ గా తమిళ సై ని గౌరవిస్తున్నాం.. ఆమె తన గౌరవాన్ని కాపాడుకోవాలి. డ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరం. గవర్నర్ సమస్యలు సృష్టించకూడదు. ఇప్పటికైనా గవర్నర్ హుందా గా ప్రవర్తించాలని అన్నారు.

ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ .ప్రధాని మోడీ మధ్యతరగతి ,బీసీ వర్గాలకు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. ఓబీసీ లకు కేంద్రం లో మంత్రిత్వ శాఖ నే లేదు. మోడీ ఏ మొహం పెట్టుకొని బీసీ లకు మధ్యతరగతి వారికి బీజేపీ కార్యకర్తలు చేరువ కావాలని కోరతారు. తెలంగాణ లో అమలవుతున్న పథకాల ను చూసి మోడీ నేర్చుకోవాలి. కనీసం ఈ బడ్జెట్ లోనైనా మోడీ బీసీ లకు నిధులు కేటాయించాలి. బండి సంజయ్ కి దమ్ముంటే మోడీ మెడలు వంచి తెలంగాణ పథకాలను దేశ బడ్జెట్ లో పెట్టించాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie